బ్లాక్ పంచాయతీ అభివృద్ధి పనుల ఆమోదంపై సమీక్షా సమావేశం
05-08-2026 09:17 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 16 వ ఆర్ధిక సంఘము సూచనల మేరకు 2026-27 ఆర్ధిక సంవత్సరం బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ పై చర్చించి, గ్రామ పంచాయతీ లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ప్రతిపాదించిన పనులకు, రాబోయే రోజులలో చేయాల్సిన పనులపై చర్చించి ప్రతిపాదనలు స్వీకరించడం జరిగింది. ఆయా, పనుల నిర్వహణకు కావాల్సిన అంచనా వ్యయం అమోదించటానికి మండల ప్రత్యేక అధికారి మోహన్ రావు మరియు ఎంపీడీఓ సోమసుందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీవో నాగరాజు, లైన్ డిపార్ట్మెంట్స్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.






