1 April, 2026 | 8:20 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్

01-04-2026 06:22 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ 14 వ డివిజన్ పరిదిలోని చింతకుంట, గాంధీనగర్ లో గల నివాసం ఉంటున్న రాచకొండ ప్రశాంత్,భూక్య అశ్విని శ్రీధర్ కు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, కొత్తపల్లి మాజీ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా గడ్డి ప్రదీప్ మాట్లాడుతూ... అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల పాలై పడుతున్న వారిని ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, సహాయం అందడానికి కృషి చేసిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిజేశారు.