1 April, 2026 | 9:49 PM

సీతారాంపల్లి గ్రామపంచాయతీ స్లాబ్ నిర్మాణ పనులు

01-04-2026 07:54 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలం సీతరాంపల్లి గ్రామంలో బుధవారం నూతన గ్రామపంచాయితీ స్లాబ్ పనులకు శ్రీకారం చుట్టారు. . ఈ కార్యక్రమానికి సర్పంచ్ వెన్నెల భానుశ్రీ సిద్దారములు ప్రధాన అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఉపసర్పంచ్ జాలిగామ స్వామి, పాలకవర్గ సభ్యులు రమేష్, రాజు, సరోజన, ప్రవీణ్, రుచిత, దేవవ్వ, మాల్లవ్వ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు జాలిగామ పోచయ్య, వెన్నెల లక్ష్మణ్, జాలిగామ రాజు తదితరులు హాజరయ్యారు. గ్రామాభివృద్ధి పనులు కొనసాగుతుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.