క్రీడాకారులను ప్రోత్సహించితే మరింత ఎదిగే ఆస్కారం
13-05-2026 03:54 PM
బోథ్,(విజయక్రాంతి): మారుమూల ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించినట్లయితే వారు మరింతగా ఎదిగే ఆస్కారం ఉందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అల్పటి అచ్చితానంద రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పిపిఎల్ టీం 11కు టీ షర్టులను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో ఎంతోమంది క్రీడాకారులు ఉంటారని వారి నైపుణ్యం బయటకు రావాలంటే ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రీడాలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.






