సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం కేసులో నలుగురు అరెస్ట్
28-08-2026 08:51 AM
మరో నలుగురు పరారీ
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీ రాములపల్లి గ్రామంలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీ,హరిహర ఆగ్రో ఇండస్ట్రీల్లో సీఎంఆర్‌కు చెందిన ధాన్యం దుర్వినియోగం జరిగినట్లు కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు,జగిత్యాల జిల్లా సివిల్ సప్లై అధికారులు తనిఖీల్లో గుర్తించారు.సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేశామని, నలుగురిని అరెస్ట్ చేసి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని మల్యాల సిఐ రాజ్ కుమార్,కొడిమ్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు.






