లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ
23-03-2026 12:00 AM
మేడిపల్లి, మార్చి, 22 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలో మేడిపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించడం జరిగింది. మనిచర్ల లావణ్య సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
అందులో భాగం గా ఆదివారం బోడుప్పల్ సర్కిల్లోని లయ న్స్ క్లబ్ అధ్యక్షులు వేముల కేశవ నాదం గౌడ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో లయన్ రాజోజు నరసింహ చారి, లయన్ మేకల మల్లేశం, లయన్ బింగి బిక్షపతి, లయన్ శారద,లయన్ దుర్గా, లయన్ లావణ్య,లయన్ సావిత్రి,లయన్ పరమేశ్వరి, లయన్ ప్రభాకర్, లయన్ సదానందం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.




