20 June, 2026 | 8:42 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

క్రీడాకారులకు సామగ్రి పంపిణీ

23-02-2026 12:27 AM

మహబూబాబాద్ ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పనిచేస్తోందని, అందులో భాగంగానే క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ జరుగుతోందని జిల్లా క్రీడా, యువజన సంక్షేమ అధికారి జ్యోతి తెలిపారు.

మహబూబాబాద్ జిల్లాలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న అథ్లెట్ క్రీడాకారులకు సోమవారం ప్రత్యేక స్పోరట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోరట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి సహకారంతో క్రీడా సామాగ్రి అందజేయడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా సీఎం కప్ స్పెషల్ ఆఫీసర్ నందకిషోర్ గోకుల్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవిలు క్రీడల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మరింత మెరుగ్గా రాణించేందుకు తమ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక స్పోరట్స్ కిట్లు మంజూరు చేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని క్రీడాకారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోరట్స్ అథారిటీ జిల్లా యువజన సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.