సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
ఖమ్మంటౌన్, ఏప్రిల్, 24 (విజయక్రాంతి): తన సిఫార్సు మేరకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పంపిణీ చేశారు. ఈ మేరకు ఖమ్మం బుర్హాన్ పురంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ. 8.50 లక్షల విలువైన చెక్కులను 19 మంది బాధితులకు అందజేశారు. మరో ఇద్దరికి ముందస్తు ఆపరేషన్ నిమిత్తం మంజూరైన రూ. 4 లక్షల విలువైన ఎల్‌ఓసి పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్న బాదితులను పరామర్శించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మధిర మున్సిపల్ కౌన్సిలర్ వెన్నంశెట్టి అప్పారావు, మధిర పట్టణ బీఆర్‌ఎస్ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాసా రామారావు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లేడిపోయిన గోపాలరావు, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






