22 July, 2026 | 8:28 PM

ధర్మేంద్ర ప్రధాన్ కాదు... మోదీ రాజీనామా చేయాలి

22-07-2026 07:15 PM

కాక్రోచ్ లపై దాడిని ఖండిస్తున్నాం

బీఎస్పీ మండల్ ప్రెసిడెంట్ టప్ప భానుచందర్ 

చేగుంట,(విజయక్రాంతి): ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వగించిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీకి బాద్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని  బీఎస్పీ చేగుంట మండల అధ్యక్షులు టప్ప భానుచందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్యర్యంలోలో  22 రోజులుగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనకు దిగితే ఎలాంటి చర్చలు ప్రారంభించని కేంద్రం.

శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే మాత్రం పోలీసులు, పారామిలటరీ దళాలతో అణచివేయడం దారుణమని ఆయన మండి పడ్డారు. ఇంతటి అలజడికి కారణమైన మోడీ తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. అలాంటి హక్కును కాలరాయడం బీజేపీకి కొత్తేమీ కాదని ఆయన అన్నారు. దేశంలో అశాంతి, అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తూ, విద్యార్థుల జీవితంలో మట్టికొడుతున్న మోదీ లీకుల సర్కారును ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు