22 July, 2026 | 8:24 PM

ఎస్‌ఐఆర్ ప్రక్రియకు బీఎల్‌ఏలు సహకరించాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

22-07-2026 07:42 PM

వనపర్తి,(విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఎన్నికల అధికారులతో సమన్వయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటైజేషన్ 77.49 శాతం పూర్తైందని, పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న మూడు నుంచి నాలుగు రోజులు కీలకమని, ఓటర్లందరూ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేలా బీఎల్‌ఏలు చొరవ చూపాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.