25 April, 2026 | 2:32 AM

నైపుణ్యాభివృద్ధితో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు

25-04-2026 12:53 AM

కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 24 ,(విజయక్రాంతి): నైపుణ్యాభివృద్ధి తో యువతకు విశృత ఉపాధి అవకాశాలున్నాయని, ప్రభుత్వ పథకాలతో స్వయం ఉపాధి సాధించి ఆర్థిక స్వాలంబన సాధించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వారం కార్యక్రమాలలో భాగంగా పాల్వంచలో శుక్రవారం నవఒకేషనల్ లో నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న మహిళలు, పురుషులతో కలెక్టర్ ప్రత్యక్షంగా మట్లాడి వారికి అందుతున్న శిక్షణ నాణ్యత, శిక్షణ కాలవ్యవధి, శిక్షణ అనంతర ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు, ఆదాయ సాధన అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.  అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో వృత్తి విద్య కు ఉన్న ప్రాధాన్యతను యువత సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సంప్రదాయ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కలిగి ఉంటేనే ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు.  ప్రస్తుతం పరిశ్రమలు, సర్వీస్ రంగాలు నైపుణ్యంతో కూడిన సిబ్బందిని కోరుకుంటున్నాయని, వెల్డింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫిట్టింగ్, సోలార్ టెక్నాలజీ, మెషిన్ ఆపరేషన్, డిజిటల్ సర్వీసులు వంటి రంగాల్లో శిక్షణ పొందిన వారికి మంచి డిమాండ్ ఉందన్నారు.

శిక్షణ పొందిన యువత చిన్న స్థాయిలో యూనిట్లు ప్రారంభించి క్రమంగా వ్యాపారాలను విస్తరించుకోవచ్చని, దీనివల్ల ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని .సిపిఓ సంజీవరావు, తహసీల్దార్ ధారా ప్రసాద్, నవ భారత్ వొకేషనల్ ఇనిస్టిట్యూట్ హెచ్‌ఆర్ శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, బీసీ సంక్షేమశాఖ అధికారి విజయలక్ష్మి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.