అగధలో మహాదేవిగా..
దేవి, శత్రువు, ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాల నిర్మాత, డర్టీ హరి, మళ్లీ పెళ్లి చిత్రాల దర్శకుడు ఎంఎస్ రాజు మరో సినిమాతో వస్తున్నారు. ఆయన తాజా చిత్రం ‘అగధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో కథానాయిక కామాక్షి భాస్కర్ల ప్రధా పాత్రను పోషిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు సోమవారం అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు ఈ సినిమాలోని ఆమె పాత్రను ‘మహాదేవి’గా పరిచయం చేస్తూ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కామాక్షి ఆధ్యాత్మిక వాతావరణంలో కూర్చొని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: రాకేశ్ వేంకటాపురం; సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి; ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ; ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్.






