30 March, 2026 | 8:18 PM

గిరిజన విద్యార్థులకు దీక్షిత ఫెర్టిలైజర్ చేయూత

30-03-2026 06:38 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్  మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వివరాలు విద్యార్థినిలకు దీక్షిత ఫెర్టిలైజర్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు సామాగ్రిని అందించినట్లు  ప్రధానోపాధ్యాయులు మారుబాయి, వార్డెన్ శ్రీనివాస్ తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న క్రీడాకారులకు సామాగ్రితో పాటు దుస్తులను అందించినట్లు దీక్షిత ఫర్టిలైజర్ ప్రోప్రేటర్ కవ్వాల సాయి తెలిపారు. విద్యార్థినిలు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులను ప్రోత్సహించేందుకు వ్యాపారి టీ షర్ట్ లను అందించినట్లు తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. దీక్షిత ఫెర్టిలైజర్ వ్యాపారి కవ్వాల సాయిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.