9 August, 2026 | 9:54 AM

బోధన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ భాస్కరన్

09-08-2026 08:11 AM

బోధన్, ఆగస్టు 09(విజయక్రాంతి): బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను జోన్-2 బాసర డీఐజీ ఆర్. భాస్కరన్, ఐపీఎస్ శనివారం తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, ఆయుధాలు, భద్రతా పరికరాలు, ఫిర్యాదుల నమోదు విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆదేశించారు. ప్రతి కేసు దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని తెలిపారు.

బోధన్‌కు మహారాష్ట్ర సరిహద్దు ఉన్నందున ప్రధాన రహదారులపై నిఘా పటిష్టం చేయాలని, ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, డ్రగ్స్‌పై యువతకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ తనిఖీలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ, ట్రాఫిక్ ఎస్‌ఐ మహేష్, టౌన్ ఎస్‌ఐ హబీబ్ ఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.