9 August, 2026 | 9:51 AM

జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

09-08-2026 08:12 AM

ములకలపల్లి,ఆగస్టు 8 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా స్ఫూర్తి తో భారత దేశ వ్యాప్తంగా ఆగష్టు 10 న ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరగబోయే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీ యూ సి ఐ జిల్లా నాయకులు నూఫా భాస్కర్,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు, ఏ ఐ టీ యూ సి మండల నాయకులు కందిమల్ల నాగరాజు పిలుపునిచ్చారు.

శనివారం మండల కేంద్రంలో జరిగిన ప్రజాసంఘాల విస్తృత సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల,రైతుల, వ్యవసాయ కార్మికుల పొట్ట కొట్టే విధంగా కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తున్నదని అన్నారు.భారతదేశ సంపదను లూటి చేసి కొత్త పెట్టుబడిదారులకు దోచిపెట్టే విధంగా నూతన చట్టాలను రూపొందిస్తుందని,స్నేహపూర్వక వాణిజ్య ఒప్పందం పేరుతో అమెరికా నుంచి అత్యధిక సుంకం తోటి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మన దేశ సంపదను విదేశాలకు తరలించే విధంగా ఉన్నదని అన్నారు.నాలుగు లేబర్ కోడ్స్, వి బి జి రామ్ జి రద్దు చేసేవరకు పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కోర్స రామకృష్ణ, నిమ్మల మధు,రామారావు, వెంకటేశ్వర్లు,నాగేశ్వరావు, రామూర్తి,రాఘవయ్య, తదితరులు పాల్గొన్నారు.