21 May, 2026 | 2:28 AM

రైతులకు డీజిల్ కష్టాలు

21-05-2026 01:04 AM
  1. వ్యవసాయ పనులకు డీజిల్ లేక రైతన్న తిప్పలు 
  2. ఎంత ఆలస్యం కానున్న పనులు 

కుబీర్ మే ౨౦,(విజయ క్రాంతి) ఇప్పటికీ పంట కొనుగోలు జాప్యంతో సతమతమవుతున్న జిల్లా రైతన్నకు ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ డీజిల్ కొడతా మరింత కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప లు పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ లభించకపోవడంతో వ్యవసాయ పనులు చేసే రై తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఇప్పటికీ మొ క్కజొన్న జొన్న వరి ధాన్యం పండడంతో దాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తీసుకువచ్చారు. చాలా ప్రాంతా ల్లో తూకం వేసినప్పటికీ డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా వాహనాలు రాక రోజుల తరబడి ధాన్యాన్ని గోదాములకు తరలించేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.

కొన్ని గ్రామాల్లో రైతులు ప్రైవేటు వాహనాలను మాట్లాడుకుని ట్రాక్టర్లు వ్యాన్లు ఇతర వాహనాలను అద్దె తీసుకొని దానం తరలించేం దుకు ముందుకు వస్తున్న డీజిల్ కొరత కారణంగా వాహనాలు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ పెట్రోల్ కొరతను సాకుగా చూపి అధిక ధరలను వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ముధోల్ ప్రాంతంలో ధాన్యం ఎక్కువగా ఉన్న కుంటాల కుబీర్ ముధోల్ బైంసా తా నూర్ లోకేశ్వరం మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు రైతులు తెలిపారు. డీజిల్ పెట్రోల దొరికితేఅక్కడికి పరుగులు తీస్తున్నారు రాత్రి పగలు పెట్రోల్ బంకుల వద్ద పడికాపులు పడుతున్నారు 

వ్యవసాయ పనులకు ఆటంకమే 

మరో 10 రోజులు గడిస్తే వాన కాలం సీజన్ ప్రారంభమవుతుంది. నిర్మల్ జిల్లాలో రైతుల సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికి యాసంగిలో పంటలు పండించిన పంట భూములను దుక్కులు దున్ను కోవాల్సి ఉంది. ట్రాక్టర్ల సాయంతో వేసవి దిక్కులను దున్నుకుంటున్నారు. అయితే డాక్టర్లకు అవసరమయ్యే ముడి సరుకు డీజిల్ కోరుతా ఉంది. డీజిల్ దొరకకపోవడంతో దుక్కులను దుండడానికి ఆటంకం ఏర్పడుతుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు ఈ సీజన్లో 18 గంటల వరకు దుక్కులు దున్నే ట్రాక్టర్లు డీజిల్ కొంత కారణంగా ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే దుక్కులు దున్నుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో డీజిల్ దొరికాలేక డాక్టర్లను ఇంటిపట్టుకు ఉంచుకోవలసి వస్తుంది.

ప్రస్తుతం దుక్కులు దున్నుకుంటేనే జూన్ ప్రారంభంలో వర్షాలు కురిస్తే విత్తనాలు వేసుకునే పరిస్థితి ఉందని ఇప్పుడు డీజిల్ లేక దుక్కులు ఆలస్యమైతే సకాలంలో విత్తనాలు వేసుకునే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు నిర్మల్ బైంసా మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు వెళ్లి పెద్దపెద్ద క్యాన్లలో డీజిల్ పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. గత వారం రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు రెండుసార్లు పెరగడంతో పెరిగిన భారం రైతులపై పడుతుందని ట్రాక్టర్ యజమానులు రేట్లు పెంచారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికీ పంట చేతికొచ్చిన అమ్ముడు పోక ఉన్న పంటను కాపాడుకుంటూ పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పెరిగిన ధరలు డీజిల్ కొడతా రైతులను మరింత కష్టాలకు గురిచేస్తుంది. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డీజిల్ కొరత లేకుండా చూడాలని జిల్లా రైతులు కోరుతున్నారు.