calender_icon.png 17 February, 2026 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో ఉంటానో.. లేదో!

17-02-2026 01:45:21 AM

ఎమ్మెల్యే సంజయ్‌కు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారా?

ఆయన ఉన్నంత కాలం నాకు వేధింపులే

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి 

జగిత్యాల, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లకు పైగా ఉండి కార్యకర్తలు, నాయకులు, జగిత్యాల నియోజకవర్గం కోసం ఎమ్మెల్యేగా ఓడినా గెలిచినా పనిచేస్తున్నానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచన చేస్తున్నానని చెప్పారు.

బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వల్ల తనకు వేధింపులు తప్పడం లేదని విచారం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాల ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ ఏంటో గోచరించట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారా? అని ప్రశ్నించారు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జగిత్యాల మున్సిపల్ ఎన్నిక ముగింపు కాదు, ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవని పేర్కొంటూ పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు రాసిచ్చారా? అని అధిష్టానాన్ని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. స్పీకర్ జగిత్యాల ఎమ్మెల్ పార్టీ మారలేదని బీఆర్‌ఎస్‌లో ఉన్నాడని చెపుతున్నారు. కానీ ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని సూచించారు. జగిత్యాలలో ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా వుందో అని జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.