29 March, 2026 | 5:03 AM

ధోనీ 2 వారాలు దూరం

29-03-2026 12:41 AM
  1. కండరాల నొప్పే కారణం

నిరాశలో సీఎస్కే అభిమానులు

చెన్నై, మార్చి 28 : ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రెండు వారాల పాటు మ్యాచ్‌లకు దూరమయ్యా డు. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. కండరాల నొప్పి కార ణంగా ధోనీ దూరమైనట్టు తెలిపింది. ఐపీఎల్ 19వ సీజన్ కోసం ధోనీ చెన్నై క్యాంపు లో చేరినప్పటి నుంచే కాస్త అసౌకర్యంగా కనిపించాడు.

నెట్స్‌లో భారీ షాట్లు కొట్టినా కాస్త ఇబ్బంది పడ్డాడు. సీజన్ ఆరంభ సమయానికి కోలుకుంటాడని అంతా అనుకున్నా రు. ఇప్పుడు కండరాల నొప్పి ఇంకా తగ్గకపోవడంతో రెండు వారాలు తప్పుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తొలి నాలుగు మ్యాచ్‌లకు ధోనీ అందుబాటులో ఉండడు. అతని స్థానంలో సంజూ శాంసన్ కీపింగ్ బా ధ్యతలు తీసుకోనున్నాడు. సంజూను చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్ లో జడేజా, సామ్ కరన్‌లను ఇచ్చేసి తీసుకుంది. అయితే ఉర్విల్ ప టేల్ రూపంలో మరో యువ కీపర్ కూడా చెన్నై జట్టులో ఉన్నాడు. సంజూ, ఉర్విల్‌లలో ఒకరికి కీపింగ్ బాధ్యతలు దక్కొచ్చు.