9 May, 2026 | 5:33 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

బాన్సువాడలో దొంగ ఓట్లను తొలగించాలంటూ ధర్నా

07-01-2026 12:00 AM

బాన్సువాడ,జనవరి 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించి బాన్సువాడ పట్టణంలో నివసిస్తున్న వారి ఓట్లను  చేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా ఉండేందుకు వార్డులలో ఒక వర్గానికి చెందిన ఓట్లను చేర్చడం ఎంతవరకు సమంజసమని, 9వ వార్డులోని ఓట్లను ఒకటో వార్డులోకి, ఆరో వార్డులో ఏకంగా 400 ఓట్లు పెరగడం ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సి ఉన్నప్పటికీ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఓట్లు వేసిన వారు సైతం మున్సిపాలిటీలో ఓట్లు వేసేందుకు ఓటర్లుగా నమోదు కావడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు బాన్సువాడ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై ఎన్నికల అధికారులు సమగ్ర సర్వే చేపట్టిన తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలక్టర్ కిరణ్మయికి  మెమొరాండం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చీదరసాలు బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ మాజీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ మాజీ ఎంపిటిసి దాకాయ్య బిజెపి కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ రామకృష్ణ అనిల్ శివశంకర్. నసురాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి కిరణ్ బిజెపి నాయకులు చీకట్ల రాజు పాశం భాస్కర్ రెడ్డి కొండని గంగారం తోటశంకర్ శ్రీకాంత్ రాజాసింగ్ సాయిబాబా శ్యామ్. తదితరులు పాల్గొన్నారు.