మహిళలు వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సిబిఆర్ఎం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు పరిధిలోని గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలకు ఇవ్వబడిన ఋణాల చెల్లింపు తీరు,మొండి బకాయిల వసూలు, ఋణ లక్ష్యం తదితర అంశాల గురించి సిబ్బంది వారీగా సమీక్ష నిర్వహించడం జరిగింది. అదే విధంగా పేరుకుపోయిన బ్యాంకు లింకేజి రుణాల మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ జ్ఞానేశ్వర్ కుమార్ మాట్లాడుతూ... బకాయి పడిన అన్ని సంఘాలు తమ బకాయిలు చెల్లించినట్లయితే మళ్లీ తిరిగి రుణాలు ఇస్తామని తెల్పడం జరిగింది.
ఎపిఎం కొమ్మ దత్తు మాట్లాడుతూ...ప్రతీ సంఘానికి బ్యాంకు ఋణం ఇప్పించాలని తద్వారా మహిళల ఆర్థిక సుస్థిరతకు దోహదం చేయాలని తెలపడం జరిగింది. బ్యాంకు పరిధిలోని అన్ని గ్రామాల మహిళలు వడ్డీ లేని రుణాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందుకోసం సిసిలు, వివోఏలు తగు చర్యలు తీసుకోవాలని, ఏగ్రామంలో కూడా సంఘాలు మొండి బకాయిలు లేకుండా నిరంతర కృషి చేయాలని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసిలు రవి, పెంటయ్య, వివోఏలు పాల్గొన్నారు.






