16-02-2026 10:05:25 AM
ఐదు నదుల జలాలతో రుద్రాభిషేకం
వేదమంత్రోత్సవాల మధ్య శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని కీతవారిగూడెం,పోనుగోడు లో త్రిలింగేశ్వర స్వామి దేవాలయం పలు గ్రామాలలో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.కీతవారిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో చుట్టూ పలు గ్రామాల నుండి భక్తులు ఆ పరమశివుని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుండే ఆలయానికి తరలివచ్చారు.స్వామివారికి ఐదు నదుల జలాల జలాభిషేకం, రుద్రాభిషేకం సహస్రనామాలు కుంకుమార్చనలు పలు హోమాలు నిర్వహించారు.స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ గేట్లను ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆలయ పూజారి,చైర్మన్ శ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ మాట్లాడుతూ శివాలయం నిర్మించి 17వ వార్షికోత్సవం శివరాత్రి రోజున రావడం చాలా శుభదాయకంగా ఉందని,ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి మాలధారన ధరించి ఉపవాసాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నారు.20వేల మంది భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.రాత్రికి స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు