calender_icon.png 23 February, 2026 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో భక్తురాలికి పాము కాటు

23-02-2026 11:03:16 AM

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) విషాదం చోటుచేసుకుంది. తిరుమలలో రూ.300 క్యూలో నిలబడి ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన భక్తురాలు మౌనికను పాము కాటేసింది. ఆదివారం దర్శనానికి వెళ్లే ముందు ఆమె కాళ్లకు పసుపు రాసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది.  ఆమె తన భర్త, ఇతర బంధువులతో కలిసి తిరుమలకు వెళ్లింది. ఈ సంఘటన గురించి ఇతర భక్తుల నుండి సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మౌనికను మొదట అశివ్ని ఆసుపత్రికి, తరువాత తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు.