17 July, 2026 | 2:15 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

07-01-2026 09:47 PM

మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకట్ రెడ్డి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ జంగాల కాలనీకి చెందిన పర్వతం సైదమ్మ,సిరిశాల రత్నమ్మలకు ప్రభుత్వం నుండి మంజూరి అయినా ఒక్కొక్కరికి రూ.లక్ష 116ల కళ్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం తహసీల్దార్ శ్రీకాంత్ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని,ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు.