నిజాయితీ చాటుకున్న దేవరకొండ బస్ డిపో డ్రైవర్ యాదయ్య
06-04-2026 08:18 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ ఆర్టీసీ డిపో డ్రైవర్ యాదయ్య విధుల పట్ల నిజాయితీ చాటుకున్నారు. దేవరకొండ నుంచి బయలుదేరిన నడిగడ్డ మ్యారేజ్ స్పెషల్ బస్సులో ప్రయాణికుడు రూ.50,000 విలువైన లాప్ టాప్ ఉన్న బ్యాగును బస్సులో మర్చిపోయి నడిగడ్డలో దిగిపోయినాడు. డ్రైవర్ యాదయ్య ఈ 176102 గమనించి భద్రపరిచి అధికారులకు అందజేశాడు. విచారణ జరిపి దేవరకొండ డిపో బాధిత ప్రయాణికునికి లాప్ టాప్ తో కూడిన బ్యాగును సోమవారం అందజేశారు. డిపో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు విధుల పట్ల నిజాయితీ చాటినందుకు డ్రైవర్ యాదయ్య అభినందించారు.




