ఎగ్గొట్టడం చెడగొట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ నైజం: సాయి జన్ శేఖర్
ఉప్పల్,(విజయక్రాంతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం డివిజన్లోని అభివృద్ధి పనులను చెడగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ బి ఆర్ ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశమైన మాట్లాడుతూ... తాము నిధులు తెచ్చి డివిజన్లోని అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు తమ ఏదో నిధులు తెచ్చినటు అభివృద్ధి పనుల వద్ద పాలాభిషేకాలు చేసుకోవడం గొప్పలు చెప్పుకోవడం స్థానిక కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు.
నాచారం డివిజన్లోని భవాని నగర్ హెచ్ఎంటి నగర్ లో80 లక్షల రూపాయలతో గత బిఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి స్పెషల్ బడ్జెట్లో అభివృద్ధి నిధులు తెస్తే కాంగ్రెస్ నాయకులు తామేదో నిధులు తెచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జరుగుతున్న అభివృద్ధి పనులు గత మాజీ కార్పొరేటర్ శాంతి స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ చొరవతో అభివృద్ధి పనుల నిధులు మంజూరయ్యాయని స్థానిక కాంగ్రెస్ నాయకుల నుండి ఎలాంటి నిధులు మంజూరు కాలేదని ఆయన పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే పనులు మానుకోవాలని ఆయన సూచించారు. మాజీ కార్పొరేటర్ స్పెషల్ బడ్జెట్లో మంజూరు అయినట్లు సాక్షదారులతో నిరూపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మెడల మల్లికార్జున గౌడ్ కల ముత్యం రెడ్డి రామకృష్ణ భూపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఎర్రం శ్రీనివాస్ రెడ్డి కట్ట బుచ్చన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు




