23 July, 2026 | 4:14 AM

మోర్గి వసతి గృహాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్

23-07-2026 12:23 AM

నాగలిగిద్ద, జూలై 22: నాగలిగిద్ద మండలంలోని మోర్గి మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని ట్రైనీ ఎమ్మార్వో, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ దీపిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను పరిశీలించడంతో పాటు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులు శుద్ధి చేసిన తాగునీటినే వినియోగించాలని, పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో ఎంపీడీవో మహేశ్వరరావు, ఎమ్మార్వో సంగ్రామ్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి మన్మధ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.