25 June, 2026 | 1:46 PM

Breaking News

సీసీరోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాల లోపం   •   మంగనూర్ వాసి దారుణ హత్య   •   నిజాంసాగర్ పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్   •   గట్ల గౌరవరం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   నాగర్‌ కర్నూల్ నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్ రెడ్డి   •   తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం   •   డిజిటల్ అరెస్ట్ ముఠాలపై ఉక్కుపాదం.. 16 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు   •   కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో ముగ్గురు సీఎంల భేటీ   •   యాదగిరిగుట్టలో నారసింహ స్మరణతో గిరిప్రదక్షిణ   •  

ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా హడావుడి ఎందుకు..?

29-11-2025 06:15 PM

హైదరాబాద్: రెండేళ్లైనా విద్యుత్ శాఖపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఏమాత్రం అవగాహన రాలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శనివారం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ పాలసీలపై లేదని, 2400 మోగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ పై హడావుడిగా ఎందుకు వెళ్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్ పై మంత్రివర్గ నిర్ణయం ఆగమేఘాల మీద ఎందుకు..?, ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా హడావుడి ఎందుకు..? అని ప్రశ్నించారు. రూ.50 వేల కోట్ల బడా కుంభకోణం కాబట్టే హడావుడి చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు.