హైస్కూల్ ను తనిఖీ చేసిన డీఈవో
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బజార్ ఏరియా ప్రభుత్వ జెడ్పి పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఎస్ఎస్సి రెమెడియల్ క్లాసుల ఇంచార్జ్ చౌదరి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జి రాజగోపాల్ సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతోన్న సమ్మర్ క్యాంప్, ఎస్ఎస్సి రెమిడీయలు క్లాసులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, విద్యార్థుల హాజరు, సౌకర్యాలను అందిస్తోన్న స్నాక్స్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా తగు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు స్కిట్ డాన్స్ ప్రోగ్రాం ప్రదర్శించారు.. కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన పోటీలలో విజేతలకు డీ ఈ వో యాదయ్య బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీ రఘుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






