వేగంగా ఉపాధి హామీ పనులు
20-05-2026 06:40 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ పాల్గొన్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పనులు ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. పనుల నాణ్యత, వేతనాల చెల్లింపులను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.






