13 April, 2026 | 5:49 PM

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్

13-04-2026 04:22 PM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్

దేవరకొండ,(విజయక్రాంతి): చట్టసభల్లో మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం  దేవరకొండ పట్టణంలో పార్లమెంటులో మహిళా బిల్లుతోపాటు బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్ కోట రిజర్వేషన్లను అమలు చేయాలని సంఘం ఆధ్వర్యంలో నిరసన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్రం వచ్చిన నుండి ఇప్పటివరకు మహిళలకు న్యాయం జరగలేదన్నారు .మహిళలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే మహిళలను చైతన్యం కావాలంటే మహిళలకు సమాజంలో గౌరవం దక్కాలంటే కచ్చితంగా పార్లమెంట్లో పాస్ అయినటువంటి మహిళా బిల్లుతో పాటు చట్టసభల్లో బీసీ మహిళలకు కూడా సబ్ కోట మహిళా బిల్లును పాస్ చేసి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినట్లయితే. మహిళా లోకాన్ని గౌరవించినట్లు అవుతుందని తక్షణమే మహిళలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లను  డిమాండ్ చేశారు.