విద్యార్థులపై లాఠీలు కాదు.. సమాధానాలు చెప్పాలి
21-07-2026 03:43 PM
బెజ్జంకి,(విజయక్రాంతి): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చలో పార్లమెంట్ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం దమనకాండకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఎన్‌టీఏలో పారదర్శకత తీసుకురావాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేసి, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం సీపీఐ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని బోనగిరి రూపేష్ స్పష్టం చేశారు.






