16 March, 2026 | 4:16 PM

తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?

16-03-2026 01:49 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంపై(Delhi Liquor Case) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో(Delhi High Court) సవాల్ చేసింది. 23 మంది ప్రతివాదులకు నోటీసులిచ్చినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు కనీసం 4 వారాలు గడువు కోరారు. సీబీఐ తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Solicitor General Tushar Mehta) వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టు అన్యాయమైన తీర్పు ఇచ్చిందని తుషార్ మెహతా పేర్కొన్నారు.

రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు(Rouse Avenue Special Court) ఇచ్చిన తీర్పుపై తుషార్ మోహతా స్టే కోరారు. స్టే ఇవ్వలేని పక్షంలో కోర్టు ఉత్తర్వులు అమలులోకి రాకుండా చూడాలని తుషార్ కోరారు. తుషార్ మెహతా(Tushar Mehta) వాదనలను ప్రతివాదుల తరుఫు న్యాయవాదులు తప్పుబట్టారు. 'తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం, లేకుంటే అన్యాయమా?' అని ప్రతివాదులు ప్రశ్నించారు. లిక్కర్ కేసు(Delhi liquor scam case) తదుపరి విచారణను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఏప్రిల్ 6న విచారణకు వాయిదా వేశారు. లిక్కర్ పాలసీ కేసులో ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో సహా 20 మందిని విడుదల చేసింది.