8 May, 2026 | 2:24 AM

ఢిల్లీ, కోల్‌కతా చావో రేవో

08-05-2026 01:29 AM

ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ కష్టమే

ఢిల్లీ, మే 7: ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్‌లో కొన్ని జట్లకు డూ ఆర్ డై పరిస్థితి వచ్చేసింది. ఇకపై ప్రతీ గెలుపు లేదా ఓటమి ఆయా జట్ల ప్లే ఆఫ్ ఫ్యూచర్‌ను నిర్ణయిస్తుం ది. దీనిలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అత్యంత కీలకం. కాకుంటే ఢిల్లీ కంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడి ఉండడం కేకేఆర్‌కు అడ్వాంటేజ్.

ఆరంభంలో ఐదు పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు నిలుపుకుంది. ఇప్పుడు నిలకడలేని ఆటతీరుతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిట ల్స్‌పై గెలవాలని ఎదురుచూస్తోంది. గత మ్యాచ్‌లో కోల్ కతా అదిరిపోయే ఆటతీరుతో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు షాకిచ్చిం ది. బౌలర్లు ఫామ్ కొనసాగించడం, బ్యాట ర్లు రాణించడంతో మూడో విజయాన్ని అం దుకుంది. బౌలింగ్‌లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నారు.

అటు పేస్ ఎటాక్‌లో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీలతో పాటు కామెరూన్ గ్రీన్ కూడా ఉన్నాడు. ఇటు బ్యాటింగ్‌లో ఫిన్ అలెన్, రహానేతో పాటు రఘువంశీ, రింకూ సింగ్, గ్రీన్‌లపై అంచనాలున్నాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఆరంభంలో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఢిల్లీ తర్వాత గాడి తప్పిం ది. మధ్యలో హ్యాట్రిక్ ఓటములతో ప్లే ఆఫ్ రేసులో వెనుకబడిపోయింది. తర్వాత పుంజుకుని రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచినా చెన్నై చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది.

దీంతో ఇప్పుడు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కేకేఆర్‌పై ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటి వర కూ 10 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ నాలుగింటిలో గెలిచి ఆరు మ్యాచ్‌లు ఓడిపోయింది. పా యింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. నిలకడ లేని బ్యాటింగ్ ఢిల్లీకి ప్రధాన సమస్యగా మారింది. కెఎల్ రాహుల్ రాణిస్తున్నా మిగిలిన వారిలో నిస్సాంక, నితీశ్ రాణా, రిజ్వీ , స్టబ్స్ తడబడుతున్నారు. అక్షర్ పటేల్ ఒక్కసారి కూడా చెప్పుకోదగిన ఇన్నిం గ్స్ ఆడలేదు. అటు బౌలింగ్‌లో ఎంగిడి రావ డం ఢిల్లీ బలం పెంచింది. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 35 సార్లు తలపడగా కోల్ కతా 19 మ్యాచ్‌లలోనూ, ఢిల్లీ 15 మ్యాచ్‌లలోనూ గెలిచాయి.

తుది జట్లు అంచనా 

ఢిల్లీ క్యాపిటల్స్ : కెఎల్ రాహుల్(కీపర్), నిస్సాంక, నితీశ్ రాణా, స్టబ్స్, మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), విప్రజ్ నిగమ్, కుల్దీప్, స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్

కోల్‌కతా నైట్‌రైడర్స్ : రహానే (కెప్టెన్), నరైన్, రఘువంశీ, గ్రీన్, పావెల్, రింకూ సింగ్, అంకుల్ రాయ్, రమణ్‌దీప్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, వరుణ్ చక్రవర్తి