కలిసొచ్చేనా?
భారత్‌కు అచ్చిరాని అహ్మదాబాద్ స్టేడియం
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి
ఈ టోర్నీలో సౌతాఫ్రికాపై ఓటమి
భయపెడుతున్న సెంటిమెంట్
టీ20 ప్రపంచకప్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. ఈ టైటిల్ ఫైట్‌కు ముందు భారత్ ఫ్యాన్స్‌ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2023 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇదే స్టేడియం వేదికగా పరాజయం పాలైంది. ఈ సారి టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఎదుర్కొన్న ఒక్క ఓటమి కూడా ఇదే స్టేడియంలో వచ్చిందే. మరి సెంటిమెంట్ పరంగా కలిసిరాని మోదీ స్టేడియంలో భారత్ టీ20 వరల్ కప్ గెలుస్తుందా ?
అహ్మదాబాద్, మార్చి 6 : మన దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ.. అది క్రికెట్ అయినా, ఇంకెక్కడయినా సరే వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. భారత క్రికెట్ జట్టు కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రస్తు తం ఈ చర్చంతా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ స్టేడియం గురించే.. ఎందుకంటే ఈ స్టేడియం భారత జట్టుకు ఎంతమాత్రం కలిసిరాలేదు.
ఆదివారం ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఇదే వేదికలో ఢీకొనబోతున్న నేపథ్యంలో అభిమాను ల్లోనూ, ఇటు టీమిండియా మేనేజ్ మెంట్ కూ ఆ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరున్న అహ్మదాబాద్ లో ఓవరాల్ గా భారత్ రికా ర్డు బాగానే ఉన్నా మెగాటోర్నీకి వచ్చేసరికి అస్సలు కలిసిరాలేదు. 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అభిమానులకు ఒక చేదు జ్ఞాపకం. ఫైనల్ వరకూ అప్రతిహాతంగా జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చిన టీమిండియా అసలు పోరులో మాత్రం చతికిలప డింది.
లీగ్ స్టేజ్‌లో పాక్‌ను ఇదే వేదికలో చిత్తు చేసిన భారత్ ఫైనల్లో మాత్రం ఆసీస్ పై చేతులెత్తేసింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ ఓడిపోయిన ఏకైక మ్యా కూడా ఇదే వేదికపైనే.. సూపర్ 8 స్టేజ్ ఆరం భ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా అహ్మదాబాద్ స్డేడియంలోనే పరాజయం పాలైంది. 188 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక కేవలం 111 పరుగులకే ఆలౌటైం ది. దీంతో ఇప్పుడు భారత్ అభిమానులను ఈ ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడుతోంది.
ముఖ్యంగా 2023 వన్డే వరల్ కప్ ఫైనల్లో ఓటమిని, ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాపై ఓటమిని గుర్తు చేస్తూ అహ్మదాబాద్ స్టేడియం ఈసారైనా భారత్‌కు కలిసొస్తుందా అని చర్చించుకుం టున్నారు. ఓవరాల్‌గా మాత్రం ఈ స్టేడి యం భారత్ రికార్డు బాగానే ఉంది. ఇప్పటి వరకూ అహ్మదాబాద్ స్టేడియంలో టీమిండియా 10 టీ20లు ఆడితే ఏడింటిలో గెలిస్తే మూడు ఓడిపోయింది.
ఇదిలా ఉంటే పాత సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలన్న ఉద్దేశమో మరొకటో తెలీదు కానీ భారత క్రికెట్ జట్టు ఈ సారి అహ్మదాబాద్ లో తాము బస చేసే హోటల్‌ను కూడా మార్చుకుంది. గతంలో ఐటీసీలో బస చేస్తే.. ఈ సారి తాజ్‌కు షిఫ్ట్ అయింది. అలాగే స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్‌ను సైతం మార్చుకున్నట్టు సమాచా రం. ఇక పిచ్ విషయానికొస్తే అహ్మదాబాద్ స్టేడియంలో మొత్తం 11 పి లు ఉన్నాయి. ఎర్రమటి ్టపిచ్‌లు, నల్లమట్టితో సిద్ధం చేసే పి చ్‌లు ఇక్కడ వాడుతుంటారు.
నల్లమట్టితో కూడిన పిచ్ సహజంగానే బ్యాటర్లకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. పరుగుల వరద పారుతుంది. అదే ఎర్రమట్టి పిచ్ సిద్ధం చేస్తే మాత్రం స్పిన్నర్లకు కలిసొస్తుంది. వాంఖేడే స్టేడియంతో పోలిస్తే ఇక్కడ బౌండరీల పెద్ద వి. భారీ సిక్సర్లు కొట్టాలని ప్రయత్నిస్తే వికె ట్లు సమర్పించుకునే ప్రమాదముంటుంది. దీంతో బ్యాటర్లు తెలివిగా షాట్లు ఆడాల్సి ఉంది.మొత్తం మీద తమకు కలిసిరాని అహ్మదాబాద్ సెంటిమెంట్‌ను ఈ సారి బ్రేక్ చేసి మరోసారి టీ20 వరల్ కప్ అందుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది.
అహ్మదాబాద్‌లో భారత్ టీ20 రికార్డు
ఆడిన మ్యాచ్‌లు: 10
గెలిచినవి: 7
ఓడినవి: 3
విజయాల శాతం: 70




