ఆల్ ఇంగ్లండ్ ఫైనల్లో లక్ష్యసేన్
08-03-2026 01:25 AM
బర్మింగ్‌హామ్, మార్చి 7: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గత కొంతకాలంగా సంచలన విజయాలతో అదరగొడుతున్న ఈ యంగ్ ప్లేయర్ సెమీఫైనల్లో విక్టర్ లాయన్‌ను చిత్తు చేసాడు. హోరాహోరీగా సాగిన పోరులో లక్ష్యసేన్ 21 18 స్కోరుతో విజయం సాధించాడు. మ్యాచ్ మధ్యలో కండరాలు పట్టేసినా పట్టువదలకుండా పోరాడిన లక్ష్యసేన్ రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టాడు.




