26 April, 2026 | 8:03 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

పురవీధుల్లో కాషాయ తోరణాల అలంకరణ

01-10-2025 01:58 AM

ఆమనగల్, సెప్టెంబర్ 30: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఆమనగల్ మున్సిపాలిటీలో మంగళవారం  విజయదశమి కాషాయ జెండాల తోరణాల అలంకరణ  ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. వేడుకకు ముఖ్యఅతిథిగా  మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొని మాట్లాడారు. దసరా ఉత్సవాలను నియోజకవర్గ ప్రజలంతా  పండుగ వాతావరణం లో  జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

శాంతి భద్రతలకు విగాథం కలిగించకుండా పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. మన సంస్కృతి, సంప్రదాయాలను  ప్రజలంతా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహన కమిటీ సభ్యులు కండే ప్రసాద్, అప్పం శీను గుర్రం కేశవులు, దుర్గయ్య, గోరటి నరసింహ, వస్పుల సాయిలు శ్రీకాంత్ సింగ్, మల్లయ్య, చెన్నకేశవులు, మానయ్య, చుక్క నిరంజన్ గౌడ్, కండె భాస్కర్, గోల్ రాము, రవిరాథోడ్, ఎర్రోవులు మహేష్,పద్మ ప్రశాంత్, శ్రీను నాయక్, వస్పుల రవి, చెక్కల సాయిలు పాల్గొన్నారు.