26 April, 2026 | 9:51 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం..

01-10-2025 02:00 AM

మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు, సెప్టెంబర్30  (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ విజయ డంకా మ్రోగించడం ఖాయమని వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో పెద్దముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు.

నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడరాదని పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం  చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం  కల్పిస్తామన్నారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా టిఆర్‌ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు.  ఇంకా ఈ సమావేశంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.