8 June, 2026 | 6:19 PM

Breaking News

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •  

గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

08-06-2026 04:54 PM

కరీంనగర్,(విజయక్రాంతి) కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ గందే మాధవి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్యాస్ ధరల పెంపు కుటుంబాల బడ్జెట్‌ను మరింత దెబ్బతీస్తోందన్నారు.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేరుతో పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అదే పేదలపై ధరల భారాన్ని మోపడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. గత కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా పెరిగి మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కాబట్టి తక్షణమే గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.