10 May, 2026 | 8:09 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

బ్రిటిషర్స్‌ను ఎదిరించిన యోధుడు డేవిడ్ రెడ్డి

27-01-2026 01:10 AM

మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో బ్రిటీష్ క్రూర పాలనకు ఎదురునిలిచి పోరాడిన యోధుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లాంఛ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో రూత్ లెస్, బ్రూటల్ అనే రెండు లుక్స్ లో మంచు మనోజ్ ఇంటెన్స్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు లుక్స్ చూస్తే మూవీలో టెర్రఫిక్ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. మంచు మనోజ్ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, పర్ ఫార్మెన్స్ తో డేవిడ్ రెడ్డి పాత్రకు లైఫ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారు.