21 March, 2026 | 3:43 AM

పొంచి ఉన్న ముప్పు.. పట్టించుకోరా..?

21-03-2026 12:22 AM

ఇల్లందు టౌన్ మార్చి 20, (విజయక్రాంతి): ఇల్లందు మునిపాలిటీ 21వ వార్డు స్టాలిన్ నగర్ లో విద్యుత్ తీగలపై భారీ వృక్షాల కొమ్మలు వేలాడుతూ మృత్యుఘటింకలు మోగిస్తున్నాయి. స్వల్ప గాలివాన వచ్చిన ఈ కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం పొంచి ఉంది. నిత్యం వాహనదారులు, బాటసారులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పంచింది ప్రమాదకరమైన కొమ్మలను తొలగించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.