7 May, 2026 | 2:21 AM

ఎండ తీవ్రతలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటించాలి

07-05-2026 01:27 AM

అలంపూర్ మే 6: వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని డిఆర్డిఓ ముసాయిదా బేగం సూచించారు. బుధవారం ఆమె, ఎంపీడీవో రాఘవతో కలిసి పల్లెపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ... ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఉపాధి పథకం పనులకు వెళ్లే కూలీలు ఉదయం త్వరగా పనులకు వెళ్లాలని సూచించారు.అనంతరం బోరవెల్లి గ్రామంలో స్నేహ మీటింగ్ కార్యక్రమానికి హాజరై కిషోర్ బాలికలు అందరూ కూడా సంఘాలలో చేరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బాల్య వివాహాల మీద ప్రజలంద రూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల ఏ పీ ఓ విజయ లలిత, సర్పంచులు రమేష్ హరిచంద్ర రెడ్డి ,పంచాయతీ కార్యదర్శులు ప్రభాకర్ ,అరుణ టెక్నికల్ అసిస్టెంట్ మాధవ్ , ఫీల్ అసిస్టెంట్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.