ఆరు గ్యారెంటీలకు రూ. 50,713 కోట్లు
గత బడ్జెట్ కంటే 5,371 కోట్లు తగ్గింపు
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.50,713 కోట్లు కేటాయించింది. అయితే గత ఏడాది ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్‌లో రూ.56,084 కేటాయించిన సర్కార్.. ఈసారి మాత్రం రూ.5,371 కోట్లు తగ్గించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాల హామీతో విస్తృతంగా ప్రచారం చేసింది.
ఆరు గ్యారెంటీల్లో పథకాల వారీగా కేటాయింపులు
రైతు భరోసా 18,000 కోట్లు
చేయూత పెన్షన్లు 14,861 కోట్లు
విద్యుత్ రాయితీ (వ్యసాయం) 14,000 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు 5,500 కోట్లు
ఉపకార వేతనాలు 4,343 కోట్లు
మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ప్రయాణం) 4,305 కోట్లు
కళ్యాణలక్ష్మి పథకం 3,683 కోట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ 3,500 కోట్లు
గృహజ్యోతి (ఉచిత విద్యుత్) 2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్య (వైద్య సేవలు) 1,143 కోట్లు
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ 723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 600 కోట్లు




