15 July, 2026 | 6:22 PM

Breaking News

నగరంలో రూ.1.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన   •   తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలి   •   వాసవి వరల్డ్ విద్యార్థి ప్రతిభ   •   తాడిచర్ల–2 బ్లాక్ విజయోత్సవంలో సింగరేణి డైరెక్టర్ పి&పి కె.వెంకటేశ్వర్లు   •   ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమస్యలు చెప్పండి   •   మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ   •   నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ   •   ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ   •   విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..   •   నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు   •  

మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ

15-07-2026 06:06 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం,చేగుంట పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు పట్టణ ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ తన ఉదారతను చాటుకున్నారు. అమ్మవారి ఉత్సవాల  నిమిత్తం తన వంతు సహాయంగా రూ.1,50,000 (ఒక్క లక్షా యాభై వేల రూపాయలు) విరాళాన్ని ప్రకటించి, ఆ నగదును ఆలయ కమిటీ సభ్యులకు  అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. ఆ మహంకాళి తల్లి దీవెనలతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవత కరుణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.