6 July, 2026 | 4:31 PM

Breaking News

ఏటీఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం   •   అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •  

కాంగ్రెస్‌కు భారీ షాక్.. నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు

07-10-2025 10:09 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు(Jubilee Hills by-election) ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ యాదవ్‌పై(Naveen Yadav) క్రిమినల్ కేసు(Criminal case) నమోదైంది. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని నవీన్ యాదవ్ పై కేసు బుక్ అయింది. జూబ్లీహిల్స్ పరిధిలో నవీన్ యాదవ్ ఓటరు కార్డులు పంపిణీ చేశారంటూ మధురానగర్ పోలీసులకు జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ యాదవ్ పై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను జాతీయ ఎన్నికల సంఘం(Election Commission of India) అధికారికంగా నిన్న విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఓట్ల లెక్కింపు, ఫలితం నవంబర్ 14న జరుగుతుంది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.