29 August, 2026 | 8:38 PM

Breaking News

సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పాదయాత్ర   •  

క్రికెట్‌ను వ్యాపారంగా మార్చేశారు!

08-06-2025 12:00 AM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట అత్యంత విచారకరం. ఒక క్రికెట్ లీగ్ కప్పు విజేతలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి స్టేడియంలో సభ ఏర్పాటు చేయటం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు ఒకే దగ్గర చేరారు. దీంతో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. ఐపీఎల్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు క్రికెట్‌కు ఊతమిస్తున్నాయనటంలో సందేహం లేదు. కానీ, ఈ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పరిధిలోకి రావు.

ఇవి పూర్తిగా బీసీసీఐకి సంబంధించినవి. ఈ క్రికెట్ లీగ్ రికార్డులు ఆ లీగ్‌లకే పరిమితం. అంతర్జాతీయ రికార్డులుగా గుర్తింపు లేదు. వాణిజ్య సంస్థలు క్రికెట్‌లోకి జొరబడి వారి వ్యాపార ప్రయోజనాలకు, వ్యాపార బ్రాండ్ల ప్రచారానికి తెరలేపుతూ లీగ్‌ల కోసం ఆటగాళ్ళను వేలంలో కొనుగోలు చేయటం పూర్తి బిజినెస్ ఫార్మాట్. ఇటువంటి లీగ్‌లకు ప్రజలను ఒక వ్యసనం మాదిరిగా ఐపీఎల్ క్రికెట్ తయారుచేసింది. బీసీసీఐ, ఐపీల్ డబ్బు కోసం క్రికెట్‌ను వ్యాపారంగా మార్చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ధోరణి మారాలి.

- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్