22 June, 2026 | 2:32 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

దామెరకుంటలో ప్రారంభమైన క్రికెట్ క్రీడా పోటీలు

01-10-2025 01:02 AM

కాటారం, సెప్టెంబర్ 30, (విజయక్రాంతి) :  క్రీడలలో పాల్గొనడం వల్ల పోటీ తత్వంతో పాటు దేహదారుడ్యత, మానసిక ప్రశాంతత, స్నేహభావం పెంపొందుతాయని దామెరకుంట సీనియర్ క్రీడాకారులు తోడే వీరన్న, ముద్దం కుమార్ యాదవ్, ముద్దం బాపు యాదవ్ అన్నారు.  గ్రామంలోని క్రీడ మైదానంలో    ఏర్పాటుచేసిన దామరకుంట క్రికెట్ లీగ్ 4 (డి పీ ఎల్ 4) పోటీలను మంగళవారం   కోడెల దామోదర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలోని సీనియర్ జూనియర్ , క్రికెట్ క్రీడాకారులు  కొన్ని జట్లుగా ఏర్పడి క్రికెట్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం అరకొరగా టీవీలు ఉండగా సెల్ ఫోన్లు అసలే లేవు, గ్రామాల్లో సాయంత్రం అయిందంటే చాలు, పాఠశాలల నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు,

వ్యవసాయ పనులకు వెళ్లిన వచ్చిన వాళ్లు, పనులు ముగించుకొని గ్రామంలోని క్రీడ మైదానాల్లో క్రికెట్ , వివిధ ఆటలు ఆడడం జరిగేది, అలాంటి గ్రామీణ వాతావరణం నేడు పూర్తిగా మారిపోయింది, సెల్ ఫోన్లు, వాట్సాప్, ఇంస్టాగ్రా, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వివిధ  యాప్ లో లీనమై  మానవ సంబంధాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి దసరా పండుగకు గ్రామంలోని యువత అందరూ ఒకచోట చేరుకొని క్రీడలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు