11-02-2026 02:39:18 AM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యాపార దృక్పథానికి ప్రేరణ పై ఘనపూర్ లోని కొమ్మురి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీవిశ్వశాంతి హై స్కూల్ విద్యార్థుల కోసం నవోత్తమ ఆలోచనలు, సృజనాత్మకత, వ్యాపార దృక్పథం అనే అంశంపై అవగాహ న కార్యక్రమం నిర్వహించబడింది.
ఈకార్యక్రమానికి డాక్టర్ కె. వంశీ కృష్ణ, ఇన్నోవేషన్ అంబాసడర్, ఐఐసీ కన్వీనర్ డాక్టర్ కే వంశీకృష్ణ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సమస్యలను అవకాశాలుగా మలచుకోవడం, అలాగే వ్యాపార ఆలోచనలకు అవసరమైన మౌలిక అంశా లపై అవగాహన కల్పించారు.
ఈకార్యక్రమాన్ని కెపిఆర్‌ఐటి ఛైర్మన్ కొమ్మురి ప్రతాప్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ కొమ్మురి ప్రశాంత్, డైరెక్టర్ కొమ్మురి దివ్య, డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమా ర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కశ్యప్ ప్రత్యేకంగా అభినందించి, ఐఐసీ బృందం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించిన శ్రీవిశ్వశాంతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు లంక కృష్ణ ప్రసాద్, మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎం. నవిత, ప్రిన్సిపల్, ఐఐసీ బృందం సభ్యులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.