2 August, 2026 | 1:36 AM

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం

02-08-2026 12:24 AM
  1. అక్రమాల బట్టబయలుకు ఫాస్ట్ ట్రాక్ విచారణ
  2. పేదల భూములు కాజేసిన వారిని వదిలిపెట్టం
  3. త్వరలో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం 
  4. మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూముల ను అక్రమంగా కాజేసిన వారిపై ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార  పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబె ట్టడం ఖాయమని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో మీడియా ప్రతి నిధులతో మంత్రి మాట్లాడారు.  తాము చేపడుతున్న సంస్కరణలను, పాలనను చూసి బీఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతుం దని, అసత్యాలను ప్రచారం చేస్తుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.