3 May, 2026 | 8:58 PM

భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ

26-12-2025 09:03 PM

మానకొండూర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసిన మండల కార్యదర్శి బోయిని తిరుపతి అనంతరం  మాట్లాడుతూ... సిపిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో పార్టీ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. పోలంపల్లి పర్లపెళ్లి మొగిలిపాలెం నల్లగొండ నుస్తులాపూర్ మల్లాపూర్ గ్రామాలలో గ్రామ శాఖల ఆధ్వర్యంలో  జెండాల ఆవిష్కరణ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది.

 భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని తిరుపతి కొనియాడారు 1925 డిసెంబర్ 26న పుట్టిన సిపిఐ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ ఎన్నెన్నో సమరాలు చేసింది. ఎన్నో త్యాగాలు చేసింది నాటి నుండి నేటి వరకు అమరుల రక్తపు ధార సాక్షిగా ఎరుపెక్కిన ఎర్రజెండా 100 ఏళ్లుగా రెపరెపలాడుతూనే ఉంది. దేశ స్వాతంత్ర ఉద్యమ సంగ్రామంలో పలువురు విప్లవకారులు దేశభక్తులు కలిసి  కమ్యూనిజం స్థాపన లక్ష్యంగా కాన్పూర్లో సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏర్పాటు సభను నిర్వహించారు.

ఇదే సిపిఐ ఆవిర్భావ దినం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించి తెలంగాణ పల్లెల్లో విముక్తి చేసి రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదురొడ్డి 10 లక్షల  ఎకరాలు పేద ప్రజలకు పంచి 4వేల మంది ప్రాణ త్యాగాలు చేసి నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసి ప్రపంచ చరిత్రలోనే మహత్తర పోరాటంగా నిలిచింది సాయుధ పోరాటం దున్నేవాడికి భూమి నినాదంతో లక్షలాది ఎకరాలు పేదలకు పంచింది.

బ్యాంకులను జాతీయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది నాటి నుంచి నేటి వరకు భవిష్యత్ తరాలకు కార్మికులకు కర్షకులకు రైతులకు యువకులకు అండగా ఉండేది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అజయమైనది కమ్యూనిజం అజరామమైనది సోషలిజం అని తిరుపతి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ సూరం మల్లేశం మరి కొమురయ్య సదానందం రమేష్ కుమార్ రాజయ్య  ముత్త ఏల్లస్వామి మేకల శ్రీనివాస్ పిట్టల తిరుపతి మల్లేశం దళపతి ఐలయ్య హరీష్ రవి తిరుపతిలు పాల్గొనడం జరిగింది.