13 July, 2026 | 9:54 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

సీపీఐ 100 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

26-12-2025 03:12 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ సిపిఐ పార్టీ కార్యాలయం ముందు సిపిఐ జెండాను బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ దుబాస్ రాములు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించిందని ఆయన తెలిపారు.

బ్యాంకులను జాతీయకరణ చేయాలని, దున్నే వాడికి భూమి దక్కాలని, కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం అందాలని, వెట్టి చాకిరి నిర్మూలించాలని, అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర సిపిఐ పార్టీకి ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి లక్షలాది ఎకరాల భూములను పంచిందని ఆయన తెలిపారు. సిపిఐ పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ కార్యకర్తలు, కార్మిక సంఘాల సభ్యులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.